You need to sign in or sign up before continuing.

A review by vidyaareads
Vaitaraṇī oḍḍuna: kathalu by Kavanamāli

5.0

దేన్ని ఎక్కువ మెచ్చుకోవాలో అర్థం కావడం లేదు.. మన మనసుని కదిలించే కథలనా.. లేకపోతే ఈ కథలను చెప్పే విధానాన్నా.. లేకపోతే మనకి తెలియకుండానే మనల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఈ కథల రచయిత నా?


వైతరణి ఒడ్డున అనే ఈ పుస్తకం లో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. కొన్ని కథలు మిమ్మల్ని నవ్విస్తే, మరికొన్ని కథలు ఆలోచింపజేస్తాయి. కొన్ని కథలు మిమ్మల్ని భయపెడితే, మరికొన్ని కథలు ఏడిపిస్తాయి. ఇలా ప్రతీ ఒక్క కథ మీలో భిన్నమైన భావోద్వేగాలని బయటకి తెచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.


ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ ఒక్కో కథ నా కళ్ళ ముందు జరుగుతున్నట్టు చాలా cinematic గా అనిపించింది. నాకు బాగా నచ్చిన మరో విషయం ఏమిటంటే.. ఎలాంటి అనవసరమైన సన్నివేశాలు లేదా వివరణలు లేకుండా, కథను ముందుకు తీసుకెళ్ళడంలో ప్రతీ పదం పాత్ర పోషిస్తుంది.


కథాకథనంలో open endings ఒక ఫ్యాషన్‌గా మారిపోయిన కాలం లో, రచయిత ప్రతీ కథ చివరిలో తన పాత్రలకు బలమైన ముగింపుని ఇస్తూ పాఠకులను ఆశ్చర్యపరుస్తాడు.


ఈ పదకొండు కథల్లో నాకు బాగా నచ్చిన రెండు కథలు: "కడలి ఒడిలో నిదురించిన ఎడారి" మరియు "అనామధేయుల ప్రణయగాథ". ఒక కథ నన్ను బాగా ఏడిపిస్తే, మరో కథలో రచయిత తన కథనంతో పాఠకుడిగా నన్ను ఆకట్టుకున్నాడు.


మీరు ఒక emotional rollercoaster లాంటి పుస్తకం చదవాలనుకుంటే, ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని త్వరలో చదవండి!