A review by vidyaareads
Nallagonda Kathalu by V. Mallikarjun

5.0

మీకో కథ చెప్తా..

దానికంటే ముందు, ఈ పుస్తకం గురించి కొంచం సేపు మాట్లాడుకుందాం.

నల్లగొండ అనే ఒక చిన్న ఊరులో, ఆ ఊరి మనుషుల గురించి, తాను పెరిగిన పరిసరాల గురించి, అమ్మ నాన్న ల గురించి, చిన్నప్పటి స్నేహితుల గురించి.. ఇలా రచయిత తన బాల్యం లో జరిగిన సంఘటనలు నెమరు వేసుకుంటూ రాసినదే ఈ పుస్తకం.. నల్లగొండ కథలు.

నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, రచయిత తెలంగాణ యాస లో ఈ పుస్తకం రాయడం. ఆ యాస లో కథలు చదువుతుంటే, నా చిన్నప్పటి స్నేహితుడు నా పక్కన కూర్చొని మా ఇద్దరి బాల్యం గురించి కబుర్లు చెప్తునట్టుంది.

ఈ పుస్తకం చదివినంత సేపు ఏమనిపించిందంటే... చిన్నప్పుడు summer holidays కి ఊరు వెళ్తే, మా తాత తో ఊరి గురించి మాట్లాడుతున్నట్టు, అమ్మమ్మ చేత్తో తిట్లు తింటునట్టు, కజిన్స్ తో కొట్లాడతునట్టు, స్నేహితులతో "ఊరు ఎంత మారిపోయింది కదా" అని ముచ్చట్లు పెట్టుకున్నట్టు ఉంది.